TG-3593
Telugu

క్రీస్తుని స్వరము విందును

Kreesthuni Swaramu Vindunu

0
views
పల్లవి

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2) యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2) మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని||

1వ చరణం

బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2) దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని||

2వ చరణం

అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2) ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని||

3వ చరణం

ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2) ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని||

4వ చరణం

నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2) ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని||

5వ చరణం

నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2) అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2) ||క్రీస్తుని||

6వ చరణం

నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2) కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2) ||క్రీస్తుని||

7వ చరణం

తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2) భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2) ||క్రీస్తుని||

8వ చరణం

మరణాంధకార లోయలో నేనుండ (2) నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2) ||క్రీస్తుని||

9వ చరణం

ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2) దీనుడనై నీ మాట అంగీకరించెదను (2) ||క్రీస్తుని||