క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి
kreesthuyeesuku mangallam maa keerthi
క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును కూడి పాడుదు మంగళం ||క్రీస్తుయేసుకు మంగళం||
ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం ||క్రీస్తుయేసుకు మంగళం||
జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం ||క్రీస్తుయేసుకు మంగళం||
ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం ||క్రీస్తుయేసుకు మంగళం||
మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం ||క్రీస్తుయేసుకు మంగళం||
జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తుయేసుకు మంగళం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.