క్రిస్మస్ అంటే ఆరాధనా కార్యం చేసే ఆలాపనా
Krismas Antee Aaraadhanaa Kaaryan Cheesee Aalaapanaa
క్రిస్మస్ అంటే ఆరాధనా కార్యం చేసే ఆలాపనా పరలోకంలో జరిగే ఆరాధన దూతలు చేసే స్తోత్రార్చన యేసుని పుట్టుకతో భువికొచ్చెను మనుజాళి అంతటికి ఆనందం షురువాయెను పాపాలను తొలగించగా శాపాలను ఎడబాపగా ధివి నుండి భూవి కొచ్చే ఆ యేసుడే రాజ్యాలనేలే మహారాజుడే మానవరూపునిగా జన్మించెను ప్రేమను పంచగా దిగివచ్చెను ఆరాధన క్రిస్మస్ ఆరాధన సంతోషమే క్రీస్తులో సమాధానమే అరణ్య ప్రాంతంలో ఆ ఎలిజబెత్తు యేసుని రాకను చూచి పులకించెను (2) మరియ గర్భాన యేసుని పసిగట్టి గంతులు వేసెను గర్భస్థ యోహాను (2) వీరంతా చేసిన ఆరాధన పరిశుద్ధ ఆత్మతో దీవించెను(2) పరిశుద్ధ ఆత్మతో దీవించెను ||ఆరాధన||
ఆ రాత్రి వేళలో మందల కాపరులు యేసుని వార్త విని సంతషించిరి (2) దేవదూతల ఆరాధనే చూసి దేవదేవుని కనులార గాంచి (2) కాపరులు చేసిన ఆరాధనతో ఊరువాడ పులకించెను (2) ఊరువాడ పులకించెను ||ఆరాధన||
ఆ తూర్పు దేశపు జ్ఞానులు తారచేసే ఆరాధనను పసిగట్టి (2) బంగారు సాంబ్రాణి బోళములర్పించి తనివి తీరా ఏసుని వీక్షించి (2) వారంతా చేసిన ఆరాధన మరణము నుండి తప్పించెను (2) మరణము నుండి తప్పించెను ||ఆరాధన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.