క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో
Krismas Shubhaveellaloo Mana Andari Hrudayaalaloo
క్రిస్మస్ శుభవేళలో - మన అందరి హృదయాలలో ఆనందమానందమే - మనసంతా సంతోషమే (2) స్తుతియించి ఆరాదిద్దాం - ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు (2) ఆ ప్రభువే నరుడాయెను - లోకమును ప్రేమించెను మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను (2) ||స్తుతియించి||
సర్వోన్నతమైన స్థలములలో - దేవునికే మహిమ ఆనందమే ఆశ్చర్యమే - సంతోషం సమాధానమే (2) దూతాళి స్త్రోత్రించిరి - కాపరులు చాటించిరి ప్రభుయేసు పుట్టాడని - మనకు తోడై ఉంటాడని (2) ||స్తుతియించి||
వింతైన తార వెలసిందని - ఙ్ఞానులు కనుగొంటిరి ఆ తార వెంబడి వారొచ్చిరి - ప్రభుయేసుని దర్శించిరి (2) రాజులకే రాజని - ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి - వినమ్రతతో పూజించిరి (2) ||స్తుతియించి||