♪♫
TG-3355
Telugu
కృప చూపుటలో (పక్షుల కన్నను)
krupa chooputaloo (pakshula kannanu)
0
views
Chorus
పక్షుల కన్నను ఉన్నతముగను నన్ను చేసితివా నా యేసు ప్రభువా (2) కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య (2) ||పక్షుల కన్నను||
1వ చరణం
పంపిన ఓడకు మరలి రాకుండగ కుళ్లులో నిలిచిన కాకివలె నుండక (2) తన కాలమంతా నీ దాసుని సేవలో (2) తరించిన కాకిలా బ్రతికే కృపనిమ్ము (2) ||కృప చూపుటలో||
2వ చరణం
కుళ్లు లోకాన కాలు మోపక తన ఓడకు మరలిన పావురము వోలె (2) శాంతికి ప్రేమకు పరిశుద్ధతకు (2) సూచనగా ఇల బ్రతికే కృపనిమ్మ (2) ||కృప చూపుటలో||
3వ చరణం
చావునెదిరించి నూత్నబలమొంద పాతవి పెకలించె పక్షిరాజు వోలె (2) అన్నపానములను నిద్రను జయించి (2) ఆత్మ బలముతో బ్రతికే కృప నిమ్మ (2) ||కృప చూపుటలో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
