TG-3599
Telugu

కృప వెంబడి కృపతో

Krupa Vembadi Krupatho

0
views
పల్లవి

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను ప్రేమించిన నా యేసయ్యా (2) నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప||

1వ చరణం

నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2) అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరింపలేను నా యేసయ్యా (2) నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప||

2వ చరణం

ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2) విడువని ఎడబాయని నా యేసయ్యా మరువక ప్రేమించిన నా యేసయ్యా (2) ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||