♪♫
TG-3602
Telugu
కృపామయుడా
Krupaamayudaa
0
views
పల్లవి
కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా||
1వ చరణం
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా||
2వ చరణం
నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా||
3వ చరణం
ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||