TG-648
Telugu

కృపామయుడా నీలోన

krupaamayudaa neeloona

187
views
పల్లవి

కృపామయుడా నీలోన (2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ||కృపామయుడా||

1వ చరణం

ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపామయుడా||

2వ చరణం

చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా (2) రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపామయుడా||

3వ చరణం

నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపామయుడా||

4వ చరణం

ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపామయుడా||