TG-3603
Telugu

కృపగల దేవా

Krupagala Devaa

14
views
పల్లవి

కృపగల దేవా దయగల రాజా కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహు ఘనతేగా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని (2) సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2) ||కృపగల||

1వ చరణం

త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే (2) జీవన యాత్రా శుభప్రదమాయే నా ప్రతి ప్రార్థన పరిమళమాయె నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము (2) ||కృపగల||

2వ చరణం

కృప చూపి నన్ను అభిషేకించి వాగ్ధానములు నెరవేర్చినావే (2) బహు వింతగా నను ప్రేమించినావే బలమైన జనముగా నను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును (2) ||కృపగల||

3వ చరణం

నా యేసురాజా వరుడైన దేవా మేఘాల మీద దిగి వచ్చు వేళ (2) ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో జీవింతు నీలోనే యుగయుగములు (2) ||కృపగల||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.