♪♫
TG-3605
Telugu
కృతజ్ఞతన్ తలవంచి
Kruthagnathan Thalavanchi
0
views
పల్లవి
కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక-నే ఈవి ఇల అర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచి నే రేపితి నీ గాయముల్ (2) దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్||
1వ చరణం
ఆకర్షించే లోకాశాలన్ని లోక మహిమ నడ్డగించు (2) కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును (2) ||కృతజ్ఞతన్||
2వ చరణం
తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము (2) నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్||