TG-4801
Telugu

కృతజ్ఞత స్తోత్రార్పణలు నీకే చెల్లింతును

Kruthajnyatha Sthoothraarpanalu Neekee Chellinthunu

0
views
పల్లవి

కృతజ్ఞత స్తోత్రార్పణలు నీకే చెల్లింతును కృతజ్ఞత హృదయార్పణలు నీకే అర్పింతును మహోన్నతుడా - నీకే ఆరాధనా ప్రేమపూర్ణుడా - నీకే ఆరాధనా.. ఆ.. ఆ.. ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2) నీదు ప్రేమను నీదు కృపలను దినదినము నేను అనుభవిస్తున్నా (2) యెహోవా యీరేగా - నాకు తోడుండి (2) ప్రతి సమయమున - ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా (2) ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2) నాడు జీవమై నాదు సర్వమై నీవై ఉండి బ్రతికించుచుంటివే (2) యెహోవా ఎల్ షడ్డాయ్ - సర్వ శక్తిమంతుడా  (2) నూతన బలముతో - పరిశుద్ధాత్మతో అభిషేకించువాడా (2) ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2) ఏ అపాయము నాగుడారము సమీపించకుండ కాపాడుచుంటివే  (2) యోహావ కాపారిగా - నా మార్గమంతటిలో (2) నా చేయి విడువక - నను ధైర్య పరచి నడిపించుచున్నవాడా (2) ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (4)