TG-4802
Telugu

కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో ప్రవేశించెదన్

Kruthajnyathalu Chellinchuchu Nee Mandiramuloo Praveeshinchedan

0
views
పల్లవి

కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో ప్రవేశించెదన్ కృపలను తలంచుచు నీ పాదముల్ ముద్దాడెదన్ లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన...నీకే ||కృతజ్ఞతలు||

1వ చరణం

దివి నుండి నాకై దిగి వచ్చావు మహి నుండి నన్ను నీలో చేర్చుటకు మరుగైన మన్నా నాకొసగావు మెరుగైన సత్యం నాకు నేర్పావు లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన.. నీకే... ||కృతజ్ఞతలు||

2వ చరణం

వేటగాని ఉరి నుండి విడిపించావు సాటిలేని ప్రేమతో నన్ను ప్రేమించావు విశ్వాసులకు మాదిరిగా నన్నుమార్చావు నీవు చూపిన ఈ కృపకై ఏమివ్వగలను లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన... నీకే... ||కృతజ్ఞతలు||

3వ చరణం

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి సరియైన త్రోవలో నన్ను నడిపావు వేల లేని నన్ను నీవే  ప్రేమించి విలువైన రక్తం నాకై కార్చావు లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన... నీకే... ||కృతజ్ఞతలు||