TG-2703
Telugu

కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము

kruthajnyathan thalavanchi naadu jeevamu

63
views
పల్లవి

కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక-నే ఈవి ఇల అర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచి నే రేపితి నీ గాయముల్ దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్||

1వ చరణం

ఆకర్షించే లోకాశాలన్ని లోక మహిమ నడ్డగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్||