TG-3608
Telugu

షణమైన గడవద

Kshanamaina Gaduvadu

0
views
పల్లవి

క్షణమైన గడవదు తండ్రి నీ కృప లేకుండా – (2) ఏ ప్రాణం నిలువదు ప్రభువా నీ దయ లేకుండా – (2) నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం నీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన||

1వ చరణం

ఇంత కాలం లోకంలో బ్రతికా జీవితం అంతా వ్యర్థం చేసా తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే||

2వ చరణం

పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2) ||నీవే||

3వ చరణం

జ్ఞానమున్నా పదవులెన్నున్నా ధనము ఉన్నా సర్వం నాకున్నా నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2) ||నీవే||