♪♫
TG-3609
Telugu
క్షణమైన నీవు
Kshanamaina Neevu
0
views
పల్లవి
క్షణమైన నీవు నను విడచి పోలేదుగా కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన||
1వ చరణం
పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2) నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన||
2వ చరణం
శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా (2) నా తండ్రివై నా తోడుగా నిలచి నా భారములన్ని తొలగించితివే (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన||