TG-3610
Telugu

క్షణికమైన బ్రతుకురా

Kshanikamaina Brathukuraa

0
views
పల్లవి

క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా క్షణికమైన సుఖమురా ఇది (2) ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా దైవ ప్రేమను మదిని నిలుపుమా ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన||

1వ చరణం

ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2) ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2) ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా||

2వ చరణం

గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2) ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2) ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా||