TG-2034
Telugu

క్షణమైన గడవదు తండ్రి నీ

kssannamaina gadavadu thandri nee

77
views
పల్లవి

క్షణమైన గడవదు తండ్రి నీ కృప లేకుండా – (2) ఏ ప్రాణం నిలువదు ప్రభువా నీ దయ లేకుండా – నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం నీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన||

1వ చరణం

ఇంత కాలం లోకంలో బ్రతికా జీవితం అంతా వ్యర్థం చేసా తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే||

2వ చరణం

పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా జ్ఞానమున్నా పదవులెన్నున్నా ధనము ఉన్నా సర్వం నాకున్నా నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.