TG-3611
Telugu

కుమ్మరి చేతిలో

Kummari Chethilo

0
views
పల్లవి

కుమ్మరి చేతిలో మంటి వలె తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2) అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి||

1వ చరణం

నాలోని స్వయమును నలుగ గొట్టుము నాలోని వంకరలు సక్కగా చేయుము (2) నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు (2) సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి||

2వ చరణం

నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసి వేయుము (2) నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము (2) నీ చేతితో నడిపించుము (2) ||కుమ్మరి||