TG-4799
Telugu

కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో

Kuthoohalan Aarbhaatamee Naa Yeesuni Sannidhiloo

13
views
పల్లవి

కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో(2) పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో ||కుతూహలం||

1వ చరణం

దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే ఆత్మలోనే దేవుడు గుర్తించె నన్ను అద్బుత మద్బుతమే ||కుతూహలం||

2వ చరణం

శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము ||కుతూహలం||

3వ చరణం

బూరద్వనితో పరిశుద్దులతో యేసు రానై యుండె ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం ||కుతూహలం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.