కూర్చుందును నీ సన్నిధిలో
kuurchundunu nee sannidhiloo
🎵 TG-2301🌐 Telugu
పల్లవి
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
1వ చరణం
ప్రతి విషయం నీకర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా నీ నామమునే హెచ్చించెదా నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే – నా ఆధారము నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా నీ వాక్యానుసారము జీవించెదా నీ ఘన కీర్తిని వివరించెదా నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే