TG-496
Telugu

లేచు దినము వచ్చును మృతు

leechu dinamu vachchunu mruthu

202
views
పల్లవి

లేచు దినము వచ్చును మృతు లెల్ల నికఁ లేచు దినము వచ్చును వేచి యిల నున్నట్టి విమలు లెల్ల నడుపు లేచి ప్రభుని నెదురు కొందు రానందముతో ||లేచు దినము||

1వ చరణం

యేసు మేఘారూఢూండై యిలకు దిగ వాసిగ దూత లపుడు భాసురంబుగ బాకా పై నినాదము సేయ గ సమాధుల నిద్రగాంచు జనులెల్లరు ||లేచు దినము||

2వ చరణం

కడబూర ధ్వని సేయఁగ మడిసిన వారు తడవు సేయక లేతురు ఎడతెగక ప్రభు నొద్దఁ గడు సంతసంబుతో విడువక యుందు రా విమల లోకమునందు ||లేచు దినము||

3వ చరణం

ఘన మహిమన్ బ్రభువు రాఁగన్ గడలి యపుడు తన యందుండెడి శవములన్ ఘనముగఁ గాననము దనయందుండెడు మృతులన్ వినయంబుతో దెచ్చి విభుని కప్పగింప ||లేచు దినము||

4వ చరణం

అరయంగ నీతపరు లా నందమున న క్షర దేహులై వెలయుచున్ జిరత రానందంబు బరలోకమున నెపుడు స్ఫురిత జీవను లగుచుఁ బరమ సుఖ మొందుదురు ||లేచు దినము||

5వ చరణం

కరుణ లేని సమాధీ నిరతము నన్నుఁ జెరపట్టి యుంచగలవే వరదుండు క్రీస్తుండు వర దూత సేనలతోఁ బరివేష్టితుఁడై యదిగో నరుదెంచుచున్నాఁ డు ||లేచు దినము||

6వ చరణం

మరణమా నీ ముల్లేది నరులను నింక వెఱపించు చుండగలవే మరణ సంహారుండు మహిమతో నరుదేరన్ మరణం బడుగుబడి య మర త్వంబిఁక నుండున్ ||లేచు దినము||

7వ చరణం

మరణంబు నొందలేదా ప్రభు యేసు నీ చెఱయందు నుండలేదా పరమేశు తనయుండు మరణ సమాధులన్ పరిపూర్ణముగ గెల్చి చెఱను జెరగపట్టెను ||లేచు దినము||

8వ చరణం

మంగళములు పాడరే క్రీస్తుకు జయ మంగళములు పాడరే మంగళములు పాడి మంగళ ప్రదుఁడైన శృంగార రాజునకు సంగీతంబులతోడ మంగళములు పాడరే ||లేచు దినము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.