లెక్కింపలేని స్తొత్రముల్‌ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

lekkinpaleeni sthothramul‌ - deevaa ellappudu nee paadedan

🎵 TG-1218🌐 Telugu
పల్లవి

లెక్కింపలేని స్తొత్రముల్‌ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌ ఇంత వరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై

1వ చరణం

ఆకాశ మహాకాశముల్‌ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్ని - ప్రభువా నిన్నే కీర్తింతున్‌ ||లెక్కి||

2వ చరణం

అడవిలో నివసించున వన్ని - సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్ని - దేవా నిన్నే పొగడును ||లెక్కి||

3వ చరణం

నీటిలో నివసించు ప్రాణుల్‌ - ఈ భువిలోని జీవరాసు లు ఆకాశమున ఎగురునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్‌ ||లెక్కి||

Report Error