TG-5700
Telugu

లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ

Lendi Lendi Meeru Kraisthavulaaraa! Dandiyau

0
views
పల్లవి

లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ ప్రభుండు బుట్టె ధరణిలో నేడు-దావీదు పురమున 1.  అవతార రూపధారుడుగా నవతరించెను - అండజేరియున్నవారి నాదరించెను పండియుండె పాకలోన పాపగ నేడు పాపముల బాపను ||లెండి||

1వ చరణం

2.  ఆహా! దూత దెల్పె గొల్లలకును చల్లని వార్త - ప్రీతితోడ ప్రభుని జూడ బయలుదేరిరి యాతురతతో మందలను పొలమున విడచి యావేళను వారు ||లెండి||

2వ చరణం

3.  ఆహా! తారబుట్టె నాకశమున - ఆదినంబున ఆ తారగాంచి జ్ఞానులంత తరలి వెళ్లిరి బోళము బంగారములను బాలయేసుకు అర్పించిరి నాడు ||లెండి||