Maa Dhinamulu Lekinchuta
Maa Dhinamulu Lekinchuta
మా దినములు లెక్కించుట నేర్పుము ప్రభువా ముదిమివచ్చువరకు నన్ను - మోయుచున్న యెహోవా (2) నీడవలే మా దినములు గడిచిపోవుచున్నవి తరము వెంబడి తరము తరలిపోవుచున్నది (2) జ్ఞాని ఏమాయెనని - వాక్యమడుగుచున్నది (2)
నేర్పుము ప్రభువా.. నేర్పుము ప్రభువా.. మా దినములు లెక్కించుట(2)
ఎవరయ్యా స్థిరులు - భూమి మీద నరులు విడిచిపోయేవే - సిరులు సంపదలు (2) క్రీస్తు యేసునందే - కారణజన్ములు పరమార్థం మరచిన - పరమ తండ్రి పిల్లలు గూడు విడిచి తిరుగుతున్న పక్షులు - వలస పక్షులు ||నేర్పుము||
వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము లోకమంత నిండుకుంది జీవపు డంబము (2) ఏర్పరచబడిన ఇది మోసగించు లోకము పడిపోయిన స్థితి నుండి లేచుట అవసరము పశ్చాత్తాపముతో బ్రద్దలైన హృదయము.. కఠిన హృదయము ||నేర్పుము||
మరనాత రమ్మని - యేసయ్యను పిలిచి దినములు చెడ్డవని - భక్తితో తలచి (2) ఇది శాంతి లేని లోకమని - ఎరిగిన ప్రియులు పరలోకం కావాలని - కోరుకున్న జ్ఞానులు నెమ్మదిపొందే స్థలములో ఉన్నారు కృపను పొందుకున్నారు ||నేర్పుము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
