TG-5560
Telugu

మా మొర నాలకించుము మహారాజ యేసు ప్రభువా

Maa Mora Naalakinchumu Mahaaraaja Yeesu Prabhuvaa

0
views
పల్లవి

మా మొర నాలకించుము - మహారాజ యేసు ప్రభువా కోపముతో నను జూడకుము - కనికరమున పలుకుము 1.  నిన్నెట్లు విడనాడెదను - ప్రాణప్రియుడా నా యేసు సిలువకు జడియలేదు - శ్రమలకు బెదురలేదు నీ నోట దూషణమాట - ఒకటైనను రాలేదు 2.  పరలోకమును విడచితివి - పాపులకై ఏతెంచితివి సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి ఇట్టి నీ ప్రేమకు నేను - ఎట్టి ధనమియ్యగలను 3.  సమస్త లోకమునకు - నీ రక్తము నిచ్చితివి మూయబడిన యీ తలుపు - తీయబడెను నీ వలన నే నేల నీ సంస్తుతిని - నిరతంబు చేయకపోతి 4.  జగమంత నీ రాకడను - నిరీక్షించుచుండెను నీ నీతిని నెరవేర్చుటకు - ఖ్యాతిగ నరుదెంచితివి నిబంధన ననుసరించి - విముక్తిని మా కొసగితివి 5.  రక్షకుండా పాపులను - శిక్షించక రక్షించు నిత్యజీవము నిమ్ము - ఆత్మయందు దీనులకు దైవ కుమారా యేసు - సార్వత్రిక నివాసీ