TG-1311
Telugu

మా నాన్న యింటికి నేను వెళ్ళాలి

maa naanna yintiki neenu vellllaali

192
views
పల్లవి

మా నాన్న యింటికి నేను వెళ్ళాలి నా తండ్రి యేసుని నేను చూడాలి మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది మా నాన్న యింటిలో నాట్యమున్నది

1వ చరణం

మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను కన్నీటితో నేను కడిగెదను తల వెంట్రుకలతో తుడిచెదను ||మా||

2వ చరణం

బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను నీ వాక్యమును నేను ధ్యానించెదను ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||మా||

3వ చరణం

నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా పరలోక ఆనందం పొందెదను ఈ లోకమును నేను మరిచెదను ||మా||