మా సర్వానిధి నీవయ్యా
Maa Sarvaanidhi Neevayyaa
మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
మా పాపములకై కలువరి గిరిపై నలిగితివా మా ప్రియ యేసయ్యా (2) విరిగి నలిగిన హృదయాలతో (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
నీవే మార్గము – నీవే సత్యము నీవే జీవము – మా యేసయ్యా (2) జీవపు దాత శ్రీ యేసునాథ (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
మా స్నేహితుడవు – మా రక్షకుడవు పరిశుద్ధుడవు – మా యేసయ్యా (2) పరిశుద్ధమైన నీ నామమునే (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.