♪♫
TG-5571
Telugu
మాధుర్యంపు నామము మోదమిచ్చుగానము
Maadhuryanpu Naamamu Moodamichchugaanamu
0
views
పల్లవి
1. మహావైద్యుండు వచ్చెను - బ్రజాళి బ్రోచు యేసు సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్ పల్లవి: మాధుర్యంపు నామము - మోదమిచ్చుగానము వేదవాక్య సారము - యేసు దివ్యయేసు 2. మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు 3. వినుండి గొర్రెపిల్లను - విశ్వాసముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్ 4. ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్ శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్ 5. ఓ యన్నలారా - పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు 6. ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్ దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు 7. శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును ప్రియంపు దాసులౌచుచు - రయంబు కొల్వుడేసున్