TG-5574
Telugu

మానవ రూపమును ధరించి అరుదెంచె

Maanava Roopamunu Dharinchi Arudenche

19
views
పల్లవి

మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే 1.  కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్ శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్ వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే 2.  చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే 3.  సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందను కన్నీటిని విడుచుచును దూరముగా నీవుందువా? నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురా ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.