మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది
maanavudaa kaaranna janmudaa ? nee janmaku kaarannamundi
🎵 TG-1172🌐 Telugu
పల్లవి
మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది (2) అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు (2) పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని (2) || మానవుడా ||
1వ చరణం
పువ్వులెందుకు? కాయలెందుకు ? ఋతువులెందుకు ? కాలాలెందుకు ? ఉన్నవన్ని నీకోసమేనని - నీవు దేవునికోసమేనని 2 గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో (2) నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ || మానవుడా ||
2వ చరణం
సూర్యుడెందుకు? చంద్రుడెందుకు రాత్రులెందుకు? పగలు ఎందుకు? (2) రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆదేవుని పని నీవు చేయాలని (2) ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి (2) పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ || మానవుడా ||