TG-3633
Telugu

మానవుడవై సకల నరుల

Maanavudavai Sakala Narula

0
views
పల్లవి

మానవుడవై సకల నరుల మానక నా దోషముల బాపుటకు బలియైతివే యేసు – (2) బహు ప్రేమ తోడ ||మానవుడవై||

1వ చరణం

నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2) నియమంబు నిచ్చి ||మానవుడవై||

2వ చరణం

నీ శరీరము రొట్టె వలెనె నిజముగా విరువంగబడెనే నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2) నా యన్న యేసు ||మానవుడవై||

3వ చరణం

మంచి యూట మించి దండి పంచ గాయములలో నుండి నిత్య జీవపు టూటలు జేసితి – (2) నీ ప్రేమ నుండి ||మానవుడవై||

4వ చరణం

నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుడంటివి నీ – (2) నిజ భక్తి తోడ ||మానవుడవై||

5వ చరణం

ఎంతో ప్రేమతో బలిగానయితివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప – (2) శ్రీ యేసు దేవా ||మానవుడవై||

6వ చరణం

నిత్య బలియగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ – (2) నిజ రూప మొంద ||మానవుడవై||

7వ చరణం

నేను నీ బలిలోన గలిసి నేను నీతో గలిసి మెలిసి నేను నీవలె నుండి జేసితివే – (2) నా దివ్య యేసు ||మానవుడవై||

8వ చరణం

నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాప భారములు దిగునే – (2) నా దివ్య యేసు ||మానవుడవై||

9వ చరణం

నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే – (2) నిజ దేవా యేసు ||మానవుడవై||

10వ చరణం

నీవే నీ చేతులలో నిత్తువు ఈ నీ బలి విందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసు – (2) ఎన్నడును మరువను ||మానవుడవై||