♪♫
TG-5579
Telugu
మానవులందరు ఒక్కటేనని మదిలో మన దేవుడు ఒక్కడేనని
Maanavulandaru Okkateenani Madiloo Mana Deevudu Okkadeenani
0
views
పల్లవి
మానవులందరు ఒక్కటేనని మదిలో మన దేవుడు ఒక్కడేనని (2) అందరు అందురు – వీనుల విందుగా (2) (మరి) లోకాన జరిగేది మార్పుగా (2) ||మానవులందరు||
1వ చరణం
క్రీస్తు సిలువకు సాక్షులమందురు సాక్ష్యములిచ్చినా సాకులు మానరు (2) ప్రార్ధనకొచ్చినా పాపం మానరు (2) ప్రభువేల వానిని క్షమియించును మరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు||
2వ చరణం
మార్పులు చెందినా మాటలు మారవు మనుషులు కలిసినా మనసులు కలువవు (2) చేతులు కలిపినా హృదయం కలవదు (2) పైపైకి వందనంబులనుదురు మరి వారేల నీతిమంతులవుదురు ||మానవులందరు||