TG-3637
Telugu

మారని దేవుడవు నీవేనయ్యా

Maarani Devudavu Neevenayyaa

0
views
పల్లవి

మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని||

1వ చరణం

చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2) మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2) మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని||

2వ చరణం

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2) నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2) నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||