మార్గము చూపుము ఇంటికి నా తండ్రి యింటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి (2)
పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించెక్షామము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము (2) ||మార్గము||
ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేహి నినుచేరితి దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారినిజూపుము (2) ||మార్గము||
దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము (2) ||మార్గము||
అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు ఆకలిబాధలో అన్యాయమయిపోయె పందులు సహవెలివేయ అలవడెను వేదన అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము||
కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళితి కూలివీనిగనైన నీ యింట పనిచేసి కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించు బ్రోవుము (2) ||మార్గము||
నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను నవజీవమును కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి నన్ను దీవించెను నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2) ||మార్గము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.

