TG-3644
Telugu

మారిపోయెనే నా పాపపు మనసు

maaripooyenee naa paapapu manasu

22
views
పల్లవి

మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా (2) ||మారిపోయెనే||

1వ చరణం

సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా (2) పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే||

2వ చరణం

యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా (2) యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.