♪♫
TG-3643
Telugu
మారిపోవాలి ఈ లోకమంతా
Maaripovaali Ee Lokamanthaa
0
views
పల్లవి
మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత (2) మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ (2) పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి||
1వ చరణం
మనము వెలగాలి ఒక దివ్య వెలుగై (2) వెలిగించాలి ఈ జగతినంతా (2) కదలి రావాలి కరుణంత మనలో (2) కరిగిపోవాలి కఠినాత్ములంతా (2) ||మారిపోవాలి||
2వ చరణం
మనము బ్రతకాలి విలువైన బ్రతుకు (2) బ్రతికించాలి ప్రభుయేసు బోధ (2) ఆదుకోవాలి నర జాతినంతా (2) అందించాలి ప్రభు వాక్యమెంతో (2) ||మారిపోవాలి||
3వ చరణం
మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ (2) మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ (2) వినిపించాలి మన సాక్ష్యమంతా (2) కదిలించాలి హృదయాలనంతా (2) ||మారిపోవాలి||