మార్పు చెందవా నీవు మార్పు చెందవా
maarpu chendavaa neevu maarpu chendavaa
మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా....ఆ నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని యెరిగి మారు మనసును పొందవా.... మారు మనసును పొందవా (2)
ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై(పర)లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) ॥మార్పుచెందవా॥
దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు (2) ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు (2) ||మార్పుచెందవా||
ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
