TG-5601
Telugu

మార్పులేనివాడవు యుగయుగములకు మనుషులే మారిన

Maarpuleenivaadavu Yugayugamulaku Manushulee Maarina

0
views
పల్లవి

మార్పులేనివాడవు - యుగయుగములకు (2) మనుషులే మారిన - మారని వాడవు కాలం మారిన - మారని వాడవు నీవే నీవే నీవే యేసయ్యా మారని దేవుడా నీవేనయ్యా (2) ||మార్పు||

1వ చరణం

నా జీవిత యాత్రలో - స్థితి గతులే మారగా నా యెడ నీ ప్రేమ మారనే లేదు (2) నా ప్రతి స్థితియందు - నా చెంతనిలిచి ఉన్నత స్థితియందు నను నిలుపుటకు (2) నిన్న నేడు నిరంతరం మారని దేవుడా నీవెనయ్యా (2) ||మార్పు||

2వ చరణం

ప్రతికూలతలు - పరిశోధనాలు నాకెదురై నన్ను కలవరపరచగా (2) నా యెడల జాలిపడి - చేర నుండి విడిపించి స్వతంత్రునిగా నను చేసితివి (2) నిన్న నేడు నిరంతరం మారని దేవుడా నీవెనయ్యా (2) ||మార్పు||

3వ చరణం

నీ రాకాడలో - నిన్ ఎదుర్కొనుటాకు ఆత్మాభిషేకముతో నను నింపితివి (2) వధువు సంగముగా - నే సిద్దపడి నిన్ ఎదుర్కొందును ఆ గడియాలోనే (2) నిన్న నేడు నిరంతరం మారని దేవుడా నీవెనయ్యా (2) ||మార్పు||