TG-5589
Telugu

మారు మనస్సు పొందుము ప్రభుని రాజ్యము సమీపించెను

Maaru Manassu Pondumu Prabhuni Raajyamu Sameepinchenu

0
views
పల్లవి

మారు మనస్సు పొందుము - ప్రభుని రాజ్యము సమీపించెను 1.  యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెను తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు - తన శౌర్యమునెంతో చాటెదరు 2.  ఆయన రాజ్యము శాశ్వతము ఆత్మలో దీనులగువారు ఆ రాజ్య వాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు 3.  నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును ఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు 4.  రక్తమాంసంబులు దానిని స్వతంత్రించు కొనజాలవు స్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు 5.  అంధకార రాజ్యమునుండి పొందుగా తన రాజ్యంబునకు ప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము