TG-5581
Telugu

మాయ లోకము మోసపోకుము

maaya lookamu moosapookumu

44
views
పల్లవి

మాయ లోకము - మోసపోకుము యేసునందే రక్షణ దొరుకును నీకు (2)

1వ చరణం

బంధుమిత్రులు - భార్య బిడ్డలు - ధనము ఘనము అందచందము అవి అన్నియును - నీటిబుడగలె సమాధితోనే - సమాప్తమౌను ||మాయ లోకము||

2వ చరణం

పడగ విప్పిన - పామువలె నీ - పాపము నిన్ను వెంబడించును పాప ఫలితము - మరణమేగదా దాని అంతము నిత్యనరకము ||మాయ లోకము||

3వ చరణం

నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి - ధరకువచ్చెను నీకు బదులుగా - శ్రమల నోర్చెను - సిలువలోనే బలియాయె నేసు ||మాయ లోకము||

4వ చరణం

ఇప్పుడైనను - ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయు నిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా ||మాయ లోకము||

5వ చరణం

దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమును కార్చెను - నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగిలేచెను ||మాయ లోకము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.