మధురం మధురం కళ్యాణ రాగం
madhuram madhuram kalyaana raagam
మధురం మధురం కళ్యాణ రాగం నీ జతగా నిలిచింది అనురాగ గీతం (2) ఆ దేవుని చిత్తమే పరిశుద్ధ పరిణయం మేలు నేడు దొరికింది ఇక ఆనందం (2)
అతిమధురం ఈ సమయం జత కలిసే శుభ తరుణం నవ దంపతులకు నేడే సుస్వాగతం ఒకరికి ఒకరై కలిసుండాలని విశ్వాస ప్రేమలతో జీవించాలని ఐక్యపరచుమయ్య నీ దివ్య కృపతో సౌఖ్యమిచ్చి కాయుము నీవు ఉన్నత ప్రేమతో (2) దేవా దీవించు నేడే ఈ వధూవరులను (2)
ఇహలోక ఆశలు వీడాలని చిరునవ్వుతో మీరు సాగాలని సంసార నావ సరిగ నడపాలని సమాధానము మీలో నిలవాలని అతి శ్రేష్టమైన బంధం ఇది యెహోవా కట్టిన ఇల్లే ఇది (2) ఐక్యపరచుమయ్య నీ దివ్య కృపతో సౌఖ్యమిచ్చి కాయుము నీవు ఉన్నత ప్రేమతో (2) దేవా దీవించు నేడే ఈ వధూవరులను (2)
వినయముతో మీరు ఎదగాలని క్రీస్తు యేసు సాక్షులుగా ఉండాలని పరలోక దీవెనలు కలగాలని ఫలించి ధరలో వ్యాపించాలని ఘనుడేశు చేసిన ఘనమైన కార్యం మానవాళికై చేసిన పరిశుద్ధ కావ్యం ఐక్యపరచుమయ్య నీ దివ్య కృపతో సౌఖ్యమిచ్చి కాయుము నీవు ఉన్నత ప్రేమతో (2) దేవా దీవించు నేడే ఈ వధూవరులను (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
