♪♫
TG-3653
Telugu
మధురం మధురం నీ ప్రేమే
Madhuram Madhuram Nee Preme
0
views
పల్లవి
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2) మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం||
1వ చరణం
నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2) సర్వోన్నతుడా సహాయకుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||
2వ చరణం
సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2) మహోన్నతుడా మహా ఘనుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||