♪♫
TG-1162
Telugu
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
madhuramaina ee samayaana prabhuni paata paadeda
210
views
పల్లవి
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద
1వ చరణం
ఎంత ఘోర పాపులనైన మార్చివేయును ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం ||మధురమైన ఈ||
2వ చరణం
ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో యేసు రక్త ధారలే క్షమా సహితము ||మధురమైన ఈ||
3వ చరణం
కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం హింసయైన బాధయైన లేదు యే భయం యేసు మథుర నామమే రక్షణ కారణం ||మధురమైన ఈ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.