మధురమైనది నా యేసు ప్రేమ
madhuramainadi naa yeesu preema
మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2) మరువలేనిది నా యేసు ప్రేమ (2) మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
ఇహలోక ఆశలతో అందుడనేనైతిని నీసన్నిది విడచి నీకు దూరమైతిని (2) చల్లనీ స్వరముతో నన్ను నీవు పిలచి (2) నీసన్నిదిలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా ||మధురమైనది నా||
పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పినా ఎగసిపడే అలలతో కడలే గర్జించినా (2) మరణపు చాయలే ధరి చేరనీయక (2) కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా ||మధురమైనది నా||
నీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి (2) మరణపు ముల్లును విరచిన దేవా (2) జీవము నొసగినా నీ ప్రేమ మధురం ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా ||మధురమైనది నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.