TG-3432
Telugu

మహా రాజువే మా నాయకుడవే

mahaa raajuvee maa naayakudavee

Eli Mosesఎలి మోసెస్ · Eli mosesకీర్తన సంకీర్తన · Keerthana, Sankeerthana
0
views
Chorus

మహా రాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతీ స్థలమునా జతే చేరినా ప్రియమైన నా హితుడవే (2) ప్రతి స్థితిలోన నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతీ క్షణం (2)

పల్లవి పూర్వ భాగం

ఆరాధింతును అను నిత్యము నిను కొనియాడెదను నిరతము (2)

1వ చరణం

శత్రు భయముతో మది అలజడితో మార్గమే కానక నిలిచిన వారికి (2) చెదరిన గుండెకు బలమివ్వగా నిలిపితివి సంద్రము జలరాశిగా విస్మయ మొందెను వెనుతిరుగగా మరణించే శత్రువు కనిపించక స్తుతియుంచుచూ సాగేనాపయనము చేర్చితివి క్షేమముగా ఆ గమ్యము (2) ||ఆరాదింతును ||

2వ చరణం

మంటిని కూర్చి పాత్రగ మలచి నీ పోలికనిచ్చి మహిమగ తీర్చి (2) నిలిపితివి నన్ను నీవానిగా ఆత్మల రక్షణకై ఒక ప్రమిదగా సాగెదను నేను నీ సాక్షిగా నీ స్వరము నాలో ధ్వనియించగ ఇదే నాకు నిజమైన నిరీక్షణ నీ కౌగిలిలో నాకు సంరక్షణ (2)|| ఆరాదింతును ||

3వ చరణం

మరణము గెలచిన మృత్యుంజయుడవు మహిమతో దిగివచ్చు నా మహరాజువు (2) నీ మహిమ రాజ్యములో నిలవాలని జయించినవారితో గడపాలని ఈ వాంఛ తీరగ తెరువేదని అక్షయుడా చేరితి నీ శరణని వర్ణింపలేనయ్య నా భాగ్యము కడవరకు కృపలోనే నా పయనము. (2) ||ఆరాదింతును ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.