మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ
mahaa vaidyundu vachchenu prajaallim
మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసున్ ||మహా వైద్యుండు||
మీ పాప మెల్లఁ బోయెను మేలొందుఁ డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుఁడి యపార శాంతుఁ డేసు. ||మహా వైద్యుండు||
వినుండి గొఱ్ఱె పిల్లను విశ్వాస ముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుఁడి మనం బుప్పొంగ యేసున్ ||మహా వైద్యుండు||
ఆ రమ్యమైన నామము అణంచు నెల్ల భీతిన్ శరణ్యు లైన వారి నా దరించు నెంతో ప్రీతిన్ ||మహా వైద్యుండు||
ఓ యన్నలారా పాడుఁడీ యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుఁడీ ప్రియాతి ప్రియుఁడేసు ||మహా వైద్యుండు||
ఓ పిల్లలారా కొల్వుఁడీ యౌన్నత్య రాజు నేనున్ తపించువారి దాతయౌ దయామయున్ శ్రీ యేసున్ ||మహా వైద్యుండు||
శ్రీ యేసుకై యర్పించుఁడీ మీ యావజ్జీవనమును ప్రియంపు దాసులౌచును రయంబు గొల్వుఁడేసున్ ||మహా వైద్యుండు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.