TG-5545
Telugu

మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా

Mahaaghanudaa Yehoovaa Manooharudaa Yeesayyaa

0
views
పల్లవి

మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా ప్రభుప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు మహిమాత్ముడా త్రిత్వమై జీవించువాడవు - కీర్తించి మహిమపరతును స్తుతించి ఆరాధింతును - నీకే నా ఆరాధన - హల్లేలూయా ఏల్ ఎలోహీం నీవే - ఎల్షద్దాయ్ దేవుడవు - ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే 1. నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా నీవేగా అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా నీవేగా విధినే చేధించి నీవు భువినే వెలిగించగా స్తుతినే నానోట పలికించి - బహుగా దీవించగా గళమెత్తి కీర్తింతును ||హల్లేలూయా||

1వ చరణం

2. కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా నీవేగా ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా - నీ వాక్కేగా శ్రమలే నను వేధించిననూ కలతలే బాధించినా కృపయే క్షణమైనా విడువక - మహిమకే చేర్పించునని నిరీక్షించి కీర్తింతును ||హల్లేలూయా||

2వ చరణం

3. ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా నీవేగా నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా నా దేవా నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు నీవే సమాధానప్రభువై - ఏలే మహరాజువు - నీ కీర్తి కీర్తింతును ||హల్లేలూయా||