TG-3426
Telugu

మహాఘనుడవయ్యా నా యేసయ్యా

mahaaghanudavayyaa naa yeesayyaa

0
views
Chorus

మహాఘనుడవయ్యా నా యేసయ్యా మహోన్నతుడవయ్యా నా యేసయ్యా (2)

పల్లవి పూర్వ భాగం

మహాగొప్ప కార్యములు నీ సొంతం మహాఅధ్బుతములు నీ సొంతం ఆ... ఆ.. (2) ||మహాఘనుడవయ్యా||

1వ చరణం

హెబ్రీయుడైతే చంపమని ఫరో చెప్పెను ఆనాడు (2) హెబ్రీయుడైన మోషేనే ఫరో పెంచడం ఆశ్చర్యం (2) ||మహాగొప్ప||

2వ చరణం

ఏలీయాను చంపుటకై వెదకుచుండెను ఆహాబు (2) యెజెబెలు ఊరైన సీదోనులో నీవు ఏలియాను దాచుట ఆశ్చర్యం (2) ||మహాగొప్ప||

3వ చరణం

మానవజాతి అంతయును పాపములో పడియుండెను (2) మానవజాతి రక్షణకై నీవు మానవుడవుట ఆశ్చర్యం (2) ||మహాగొప్ప||

4వ చరణం

ప్రభువువచ్చును దొంగవలె బహుగా త్వరపడి సిద్దపడుదాం (2) ఆ దినమున పంచభూతములు లయమైపోవుట ఆశ్చర్యం (2) ||మహాగొప్ప||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.