TG-212
Telugu

మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర

mahaathmumdaina naa prabhu vichithra

202
views
పల్లవి

మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర సిల్వఁ జూడ నా యాస్తిన్ నష్టంబుగా నెంచి గర్వం బణంగఁ ద్రొక్కుదున్.

1వ చరణం

నీ సిల్వ గాక యో దేవా దేనిన్ బ్రేమింప నీయకు నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును. ||మహాత్ముఁడైన నా||

2వ చరణం

శిరంబు పాద హస్తముల్ నూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాదప్రేమ లీ గతిన్? ||మహాత్ముఁడైన నా||

3వ చరణం

ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీట మేసు కుండినన్ ఈ భూకిరీటములన్నీ దానం దూగంగఁ జాలు నే? ||మహాత్ముఁడైన నా||

4వ చరణం

లోకంబు నే నర్పించిన నయోగ్యమైన యీవి యౌ వింతైన యేసు ప్రేమకై నా యావజ్జీవ మిత్తును. ||మహాత్ముఁడైన నా||

5వ చరణం

రక్షింపఁ బడ్డ లోకమా రక్షింపఁ జావుఁ బొందిన రక్షకుఁ డేసునిన్ సదా రావంబుతోడఁ గొల్వుమా ||మహాత్ముఁడైన నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.