మహిమ నీకే ప్రభూ - ఘనతనీకే ప్రభూ
mahima neekee prabhuu - ghanathaneekee prabhuu
🎵 TG-1168🌐 Telugu
పల్లవి
మహిమ నీకే ప్రభూ - ఘనతనీకే ప్రభూ స్తుతియు,మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే- నా యేసు ప్రభునకే
1వ చరణం
సమీపింపరాని తేజస్సు నందు – వశియించు అమరుండవే శ్రీమంతుడవే- సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ||ఆరాధ||
2వ చరణం
ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే ||ఆరాధ||
3వ చరణం
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే ||ఆరాధ||